వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అయ్యాడు. నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే దీనిపై వైసీపీ సంధించింది. మాజీ ఎంపీ, దళిత నాయకులు నందిగం సురేష్‌ని మళ్లీ అరెస్ట్ చేసారని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకులు నందిగం సురేష్ ను వేధిస్తున్నారన్నారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్.. ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేసారని వైసీపీ మండిపడింది.

నందిగం సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసారని గుర్త చేసింది. సురేష్ కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ నందిగం సురేష్ ను చంపేయాలంటూ కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన రాజు అయినా.. కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహించింది. కానీ.. టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వైసీపీ తెలిపింది. మీకో న్యాయం.. మాకో న్యాయమా చంద్రబాబు ? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ ఫైర్ అయింది.