Nani: హిందీ ‘జెర్సీ’పై నాని ప్రశంస..నేచురల్ స్టార్‌కి పెద్ద మనసు: షాహిద్ కపూర్

-

నేషనల్ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేశారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ పిక్చర్ శుక్రవారం విడుదలైంది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన ఈ సినిమా..ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది.

ముంబైలోని ఓ థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లిన దర్శకులు గౌతమ్ తిన్ననూరికి ప్రేక్షకులు అరుదైన గౌరవం ఇచ్చారు. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి, క్లాప్స్ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని కూడా చూసి తన స్పందన తెలిపారు.

ట్వి్ట్టర్ వేదికగా హిందీ ‘జెర్సీ’ పై ట్వీట్ చేశారు నాని. తన అర్జున్ పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పూర్తి న్యాయం చేశాడని ప్రశంసించారు. గౌతమ్ తిన్ననూరి మరోసారి హిట్ కొట్టాడన్నారు. మృణాళ్ ఠాకూర్‌, పంక‌జ్ క‌పూర్ స‌ర్‌, మై బాయ్ రోనిత్ చాలా బాగా చేశారని, చక్కటి సినిమా జెర్సీ అని, మూవీ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు నాని. కాగా, నాని ట్వీట్ కు రిప్లయి ఇచ్చాడు షాహిద్ కపూర్.

థాంక్యూ మై ఫ్రెండ్ అని పేర్కొన్న షాహిద్.. ఒక అర్జున్ నుంచి మరొక అర్జున్ కు కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీ అని అన్నారు. నానిది చాలా పెద్ద మనసు అని, అందుకే జెర్సీకి ఈ స్థాయిలో ఆదరణ వచ్చిందని షాహిద్ కపూర్ ట్వీట్ లో పేర్కొన్నాడు. నానికి మరింత శక్తి లభించాలని కోరుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, సాచెట్ అండ్ ప‌రంప‌ర మ్యూజిక్‌ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version