ఏపి మాజీ సిఎం చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇవాళ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు ఆమె సంఘీభావం తెలిపారు. అలాగే మరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతి కి ఉన్న బంగారు గాజును తీసి అక్కడున్న రైతులకు ఇచ్చారు నారా భువనేశ్వరి. భువనేశ్వరి గాజును బహిరంగ వేలం వేసి, ఆ డబ్బును ఉద్యమానికి వినియోగించాలని రైతులకు తెలిపారు చంద్రబాబు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా మిమ్మల్నితలుచుకుంటున్నారు. ఆయనకు మీ తర్వాతే మేము. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఎంతగానే తపించారన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ఉంచామన్నారు. ప్రజల తర్వాత తనను, కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకునేవారన్నారు. కాగా, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. ఇవాల్టికి అమరావతి రైతుల పోరాటం 15వ రోజుకు చేరింది.