ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను టార్గెట్ చేస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎప్పటికప్పుడు ట్విటర్ వేదిగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీలో పెన్షన్లు తొలగించడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.
అవివాహిత, వికలాంగురాలు అయిన ఆమెకు పెన్షన్ ఆపేశారని, ఈ విషయమై వాలంటీర్లను అడిగితే తాలూకాకు వెళ్లమని చెప్పారని, అక్కడికెళితే మరో చోటకు వెళ్లమని చెప్పారని.. ఎక్కడికి వెళ్లి ఎవరిని కలిసినా స్పందించడం లేదని ఆ వీడియోలో ఓ మహిళ ఆరోపించడం కనబడుతుంది. అదే విధంగా, తనకు స్థలం ఉందని ఆరోపిస్తూ తనకు రావాల్సిన పెన్షన్ ని ఆపేశారని ఓ వృద్ధురాలి మొర ఈ వీడియోలో ఉంది. అయితే దీనికి నారా లోకేష్ దివ్యాంగుల పెన్షన్ కట్ చేసారు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు. ఎక్కడ ఉన్నారు? దివ్యాంగుల మొర వినండి ట్విట్ చేశారు.
దివ్యాంగుల పెన్షన్ కట్ చేసారు సిగ్గుగా లేదా @ysjagan గారు. ఎక్కడ ఉన్నారు? దివ్యాంగుల మొర వినండి…#JaganFailedCM#APDeservesBetter pic.twitter.com/IQM0fBMvwj
— Lokesh Nara (@naralokesh) February 21, 2020