నేడు అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం అయ్యింది.ఈ నేపద్యం లో నారా లోకేశ్ మాట్లాడుతూ, ఇది ఎంతో పుణ్యభూమి అని తెలియచేశారు. ఇక్కడి ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇదే యూనివర్సిటీలో చదివిన నీలం సంజీవయ్య రాష్ట్రపతులు అయ్యారని, అలాంటి గడ్డపై తాను పాదయాత్ర చేయడం తన అదృష్టం అని లోకేశ్ అన్నారు.
ఈ సభలో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు ఆయన. గత ఎన్నికల ముందు నేల జగన్ ను చూశామని, ఆ ఎన్నికలు అయిపోగానే గాలి జగన్ గా మారిపోయారని హేళన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ అహంకారం నేలపైకి వచ్చిందని అన్నారు. నిన్నటి వరకు సింహం సింగిల్ గా వస్తుందని అన్నాడని, ఇప్పుడేమో ఒంటరిగానే పోటీ చేయాలని ప్రతిపక్షాలను అడుక్కుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపై మాట్లాడినందుకు సొంత ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టాడని ఆన్నారు.
తమను ఎంత వేధించినా సహించామని, కానీ ప్రజల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమని లోకేశ్ హెచ్చరించారు. ఓ బటన్ నొక్కితే అంతా అయిపోతుందా… రాష్ట్రానికి ఇప్పటివరకు ఏం పీకారంట? అని మండిపడ్డారు. తాము తెచ్చిన 100 సంక్షేమ పథకాలను తొలగించడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడని ఎద్దేవా చేశారు.