బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తేలేదు : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఢిల్లీ లో అయన మీడియా తో మాట్లాడుతూ, కేసీఆర్ ను క్షమించేది లేదని స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తో సంబంధాలు కలిగివున్న వారిని ఎంతవారైనా ఉపేక్షించవద్దని రాహుల్ చెప్పారని వివరించారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు రేవంత్. బీఆర్ఎస్ ఒక మాఫియా వంటిదని, మాఫియాతో కాంగ్రెస్ ఎన్నటికీ కలవదని అన్నారు. కేసీఆర్ రాజకీయాలు కూడా దావూద్ ఇబ్రహీం తరహాలోనే ఉన్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీఆర్ఎస్… పరోక్షంగా బీజేపీ… ఎంఐఎంకు మద్దతు ఇచ్చాయని తెలిపారు. బీజేపీకి హైదరాబాదులో 50 మంది కార్పొరేటర్లు, ఓ కేంద్రమంత్రి, ఓ ఎమ్మెల్యే ఉన్నా పోటీ పెట్టకపోవడమే అందుకు నిదర్శనం అని అన్నారు ఆయన.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు 25 కంటే తక్కువ సీట్లు వస్తాయని అన్నారు రేవంత్. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అని హేళన చేశారు. బండి సంజయ్ ఈసారి కరీంనగర్ లో పోటీచేసి గెలవగలరా? అంటూ సవాల్ చేశారు రేవంత్. ఇక, వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలవి ఎన్జీవో రాజకీయాలు అని హేళన చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version