నారా లోకేష్‌కి సీఎం అయ్యే యోగ్యత లేదు తాత లాగా జూ.ఎన్టీఆర్‌ది మహర్జాతకం బాంబ్‌ పేల్చిన జ్యోతిష్కుడు పివిఆర్‌ నరశింహారావు

-

2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది.ఓ వైపు నారా లోకేష్‌ పాదయాత్రతో జిల్లాలను చెట్టేస్తోంటే మరోవైపు చంద్రబాబునాయుడు కూడా అడపా దడపా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏదో అంశాన్ని చేతబుచ్చుకుని అధికార వైసీపీపై మాటల దాడి చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తన కొడుకు నారా లోకేష్‌ని సీఎం పదవిలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఆయన శ్రమిస్తున్నారు.అయితే లోకేష్‌కి సీఎం అయ్యే యోగం లేదంటున్నారు ప్రముఖ జ్యోతిష్కలు పివిఆర్‌ నరసింహారావు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పుట్టిన తేదీల ప్రకారం చూస్తే రాజకీయంగా లోకేష్‌ ఎదగలేరని బాంబ్ పేల్చారు. తాత లాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ చరిత్ర తిరగ రాస్తారని కుండబద్దలు కొట్టారు.

పుట్టిన తేదీల ప్రకారం లోకేష్‌,జూ.ఎన్టీఆర్‌లపై తన అంచనాలను వివరిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. లోకేష్‌ వ్యవహారం చూసి అతన్ని పప్పు అనుకుంటారని కానీ అతను చాలా తెలివైన వాడని పేర్కొన్నాడు.అయితే ఆ తెలివి బయటి విషయాల్లో పనికిరాదన్నారు. అహంకారమే లోకేష్‌కి ప్రధాన శత్రువని రానున్న పదేళ్ళలో ఆయన సీఎం అయ్యే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.అయితే జూ.ఎన్టీఆర్‌ అలా కాదని అంటూ చాలా తెలివైన వాడని కితాబిచ్చారు. భావోద్వేగ భరిత మేథస్సు కలిగిన ఎన్టీఆర్‌కి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు.అహంకారం తారక్‌కి అడ్డంకే అయినా దానిని ఎలా నియంత్రించాలో ఎన్టీఆర్‌కి తెలుసని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్‌ రాజకీయంగా అవగాహన పెంచుకుంటాడని,తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ లాగా రాజకీయ రంగంలో అద్భుతంగా రాణిస్తారని తెలియజేశారు. రాబోయే 15 ఏళ్ళలో రాజకీయంగా పదవులు అనుభవిస్తారని అన్నారు. లోకేష్‌ మకర రాశికి చెందిన వ్యక్తి కాగా జూ.ఎన్టీఆర్‌ సింహ రాశికి చెందిన వ్యక్తి అని చెప్తూ ఈ ఇద్దరూ ఎప్పుడూ విభేదిస్తూ ఉంటారని స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం ఏపీలో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఓవైపు నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తూ రాష్ర్టాన్ని చుట్టేస్తున్నారు. మరోవైపు రాజకీయంగా పొత్తులు,అభ్యర్ధుల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ తాము అధికారంలోకి వస్తే ఈసారి పరిపాలన గతం కంటే భిన్నంగా ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు జూ.ఎన్టీఆర్‌ని అభిమానులు రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.ఇటీవల సీనియర్‌ ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో కూడా తారక్‌ అభిమానులు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే జూ.ఎన్టీఆర్‌ ఈ నినాదాలపై స్పందించకపోవడం గమనార్హం.ఈ క్రమంలో పివిఆర్‌ నరసింహారావు చేసిన ట్వీట్‌ రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version