విజయనగరం జిల్లా టీడీపీ నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. నాపై 14 కేసులు ఉన్నాయి.. ఏం పీకారు అంటూ కార్యకర్తల్లో ధైర్యం నిప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కార్యకర్తలు కేసులకు బయపడకూడదని ధైర్యం చెప్పిన లోకేష్.. మన కార్యకర్తలపై కేసులు లేవంటే పోరాటం చేయనట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు అని పోరాటం ప్రారంభించామని, నేడు వారికి గ్రామాలలో ప్రజలే బాదుడే బాదుడు చేస్తున్నారంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు అదే అతనికి చివరి చాన్స్ అంటూ లోకేష్ మండిపడ్డారు. ఉప్పు , చింతపండు సహా అన్ని నిత్యవసర దరలు పెంచారని, దొంగ కేసులకు బయపడేది లేదు, పారిపొయేది లేదు. రాష్ర్టం కోసం, ప్రజల కోసం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకోవాలంటూ లోకేష్ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.