శున‌కానందంలో వైసీపీ నేతలు ఉన్నారు : కుప్పం ఫలితాలపై నారా లోకేష్ సెటైర్‌

-

ఏపీ లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దర్శి, కొండపల్లి మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ తెలుగు దేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కుప్పం   లోనూ భారీ ఓటమి చెందింది తెలుగు దేశం పార్టీ. అయితే.. ఈ ఫలితాల పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

దొంగ ఓట్లు, వంద‌ల కోట్లు, గూండా గిరీ, అధి కారులు – పోలీసుల అండ‌ తో కుప్పంలో గెలిచామ‌ని వైసీపీ పార్టీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజ‌లు లోకేష్ రెండు చెంపలు పగలగొట్టారని శున‌కానందంలో వైసీపీ పార్టీ నేతలు ఉన్నారని చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌ కి వ్యతిరేకంగా ఓటేసి, వైసీపీ బట్టలూడదీసి వాయ‌గొట్టార‌నేది బులుగు బుర్రలకి ఎప్పుడు ఎక్కుతుందో..? అంటూ వైసీపీకి చురకలు అంటించారు నారా లోకేష్‌. దౌర్జన్యంగా తెలుగు దేశం పార్టీ విజయం సాధించిందని మండిపడ్డారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version