టెన్త్‌లో దారుణ ఫ‌లితాలు ప్ర‌భుత్వం పాప‌మే : నారా లోకేష్‌

-

నేడు ఏపీ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ.. టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. స‌ర్కారు ఫెయిల్యూర్ అని ఆయన మండిపడ్డారు. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని త‌గ్గించే కుట్ర అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కుట్ర‌తోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని ఆయన ధ్వజమెత్తారు. తొలిసారి నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌లు పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, మాల్ ప్రాక్టీసుల‌తో అభాసుపాలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టెన్త్ రిజ‌ల్ట్స్‌ వాయిదా, దిగ‌జారిన ఫ‌లితాలన్నీ స‌ర్కారు కుతంత్ర‌మేనని, నాడు నేడు పేరుతో రూ. 3500 కోట్లు మింగేసి విద్యావ్య‌వ‌స్థను నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. టీచ‌ర్ల‌కి త‌న వైన్‌షాపుల వ‌ద్ద డ్యూటీ వేసే శ్ర‌ద్ధ విద్య‌పై సీఎం ఎప్పుడూ దృష్టి పెట్టలేదంటూ ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version