పవన్‌తో పొత్తుపై బీజేపీ కోర్‌ కమిటీతో నడ్డా సమావేశం..

-

ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సోమ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్రానికి చెందిన పార్టీ శ‌క్తి కేంద్ర క‌మిటీల‌తో స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. మంగ‌ళ‌వారం కూడా ఏపీలోనే ప‌ర్య‌టించ‌నున్న న‌డ్డా… రాత్రికి విజ‌య‌వాడ‌లోనే బ‌స చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌యవాడ‌లో కాసేప‌టి క్రితం పార్టీకి సంబంధించిన ఏపీ కోర్ కమిటీ స‌మావేశాన్ని ప్రారంభించారు న‌డ్డా. ఈ స‌మావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంక‌టేశ్‌, సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్, కీల‌క నేత‌లు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, పురందేశ్వ‌రి, జీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త‌ నిర్మాణంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

అంతేకాకుండా వైసీపీ విష‌యంలో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పైనా చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. వీట‌న్నింటి కంటే ముఖ్యంగా వ‌చ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల‌తో పొత్తుల దిశగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బీజేపీ, జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌ను ప్రకటించాలంటూ జనసైనికులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version