ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తనయుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారని గుర్తుచేశారు. ఆయన్ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలోని యువతకు భరోసా ఉంటుందని వివరించారు. అంతేకాకుండా తెలుగు దేశం పార్టీకి కూడా మంచి భవిష్యత్ ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
ఇదిలాఉండగా, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గిని రాజేశాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాక నారా లోకేశ్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఏముందని పలువురు జనసేన నేతలు ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్డీయే కూటమిలో చీలికలు ఖాయమని పలువురు బడా నేతలు విమర్శలు చేస్తున్నారు.