జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లంతా తాలిబ‌న్లే : నారా లోకేష్ ఫైర్‌

-

సీఎం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లంతా తాలిబ‌న్లేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ పార్టీ యువ నేత నారా లోకేష్. సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ య‌ల్ల‌పు సంతోష్ నిండు గ‌ర్భిణి అయిన భార్య‌ని ఆస్ప‌త్రిలో డెలివ‌రీ కోసం చేర్చ‌గా, ఉగ్ర‌వాదిలాగ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. క‌నీసం నోటీసు ఇవ్వ‌కుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వ‌కుండా.. వైసీపీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు సీఐడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చాలా దారుణమ‌ని నిప్పులు చెరిగారు.

సంతోష్, ఆయ‌న భార్య‌కి ఏమి జ‌రిగినా పూర్తిగా సీఐడీదే బాధ్య‌త అని… క‌డుపుమండి సోష‌ల్‌మీడియాలో పోస్టు పెడితే అరెస్టులా… ఇది సీఎం జ‌గ‌న్‌ గారూ, ఆయ‌న తాబేదార్లు, తాటిబ‌న్ల ప‌నేన‌ని ఆగ్ర‌హించారు. సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్టే యాక్టివిస్టుల‌ను టెర్ర‌రిస్టుల్లా అరెస్టు చేయిస్తారా? అని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. వైసీపీ అరాచ‌కాల‌కు ఎండ్ కార్డు త్వ‌ర‌లోనే ప‌డుతుంద‌ని… ఏపీ ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని భ‌రోసా క‌ల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version