రాజధాని రాజకీయం: బాబు-జగన్‌ల్లో పైచేయి ఎవరిది?

-

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయాలు జరుగుతాయనే చెప్పాలి. ఇక్కడ నేతలకు ప్రజా ప్రయోజనాలు కంటే…సొంత ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లు రాజకీయం చేస్తారు. అసలు ఇక్కడ ప్రతి అంశాన్ని రాజకీయంగానే వాడుకుంటారు. ఇక మొదట నుంచి ఏపీలో రాజధాని అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో జగన్ కూడా ఒప్పుకున్నారు. ఇక అధికారంలో ఉండగా అమరావతిని టీడీపీ నేతలు వాడుకున్నారో అందరికీ తెలిసిందే.

అయితే అమరావతిలో ఏం జరిగినా….జగన్ అధికారంలోకి వచ్చాక అదే రాజధానిగా కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఏమో మూడు రాజధానులు అన్నారు. మూడు రాజధానులు అంటూ…రెండేళ్ళు కాలక్షేపం చేశాక…ఆ బిల్లులో లోపాలు ఉన్నాయని చెప్పి వాటిని రద్దు చేశారు. మళ్ళీ కొత్త బిల్లులతో వస్తామని చెప్పారు.

ఇటు ఏమో అమరావతి రైతులు రెండేళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. వారిపై వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో తెలిసిందే. అయితే అమరావతి నిజమైన ఉద్యమం అయినా సరే…దానికి చంద్రబాబు సపోర్ట్ ఉండటం వల్ల రాజకీయ రంగు పులుముకుంది. అందుకే వైసీపీ నేతలు అమరావతిని పెయిడ్ ఆర్టిస్టులు నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో అమరావతి రైతుల సభ జరగనుంది. దీనికి టీడీపీతో సహ అన్నీ విపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. దీంతో అదొక రాజకీయ సభ మాదిరిగా తయారైంది.

ఇటు రాయలసీమ పరిరక్షణ సమితితో..మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ నేతలు పోటీ ఉద్యమం చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్రలో సైతం వైసీపీ నేతలు..మూడు రాజధానులకు మద్ధతుగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అంటున్నారు. ఇలా ఓ వైపు అమరావతి, మరోవైపు మూడు రాజధానులు అంటూ పార్టీలు రాజకీయం చేస్తూ..అసలు ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్తితిలోకి తీసుకొచ్చారు. ఈ రాజధాని రాజకీయంలో చంద్రబాబు, జగన్‌లు పైచేయి సాధించి..జనాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version