ఒక్క కాకికి ఏమైనా అయితే, వంద కాకులు రొదపెడతాయని అంటారు. మరి అలాంటిది అతి పెద్ద నాయక గణం ఉన్న టీడీపీ కీలక నాయకుడు, అధినేత చంద్రబాబు గారాల పట్టి, పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా జరుగుతు న్న విమర్శలపై ఏ ఒక్కరూ మాట్టాడడం లేదు. కనీసం ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పడానికి కూడా ఎవరినీ మాటలు రావడంలేదు. దీంతో అసలు నేతలందరికీ నారా లోకేష్‌పై ఉన్న అభిప్రాయం ఏంటి ? అందరూ ఆయనను పప్పు గానే భావిస్తున్నారా? అందరూ ఆయన నాయకత్వంపై ఓ డెసిషన్‌కు వచ్చేశారా ? అందరూ ఆయనను పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ఇటీవల రెండు వారాల కిందట లోకేష్ కేంద్రంగా టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. కృ ష్ణాజిల్లా గన్నవరం టీడీపీఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీ కి మద్దతిస్తు న్నానని ప్రకటించారు. ఈ సమయంలో టీడీపీ ఆయన షోకాజ్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. నేరుగా మీడియా లైవ్‌లోకి వచ్చిన వంశీ పార్టీని ఉతికి ఆరేశారు. ముఖ్యంగా లోకేష్ కేంద్రంగా ఆయన విమర్శలు సంధించారు వాడు.. వీడు అంటూ.. పప్పుగాడు.. అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదేసమయంలో 2009లో పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకుని, ఆతర్వాత ఆయనను పక్కన పెట్టి అవమానించిందని చెప్పారు.
దీనికి ప్రధాన కారణం.. లోకేషేనని, లోకేష్ కోసమే జూనియర్‌ను పక్కన పెట్టారని, లోకేష్ ఉంటే పార్టీ నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. లోకేష్‌ను నాయకుడిగా ఏ ఒక్కరూ గుర్తించడం లేదన్నారు. పైగా.. ఆయనను నాయకుడిగా కాకుండా అందరూ పప్పుగానే గుర్తించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనే కాకుండా రాజకీయంగా కూడా తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ సమయంలో పార్టీలో ఉన్న నాయకులు పెద్దగా స్పందించలేదు. అదేంటి నిన్నటి వరకు నువ్వు పార్టీలోనే ఉన్నావు., లోకేష్‌తో చట్టాపట్టాలేసుకుని తిరిగావు.. ఇప్పుడిలా అంటావేంటి? అన్న నాయకుడు ఒక్కరూ కనిపించలేదు.
ప్రధానంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 23 మంది పార్టీ నాయకులు విజయం సాధించారు. వీరిలో 11 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో లోకేష్ మామ, బాబుకు వియ్యంకుడు అయిన బాలయ్య కూడా ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా వంశీ వ్యాఖ్యలను ఏదో ఒక రూపంలో ఖండించింది లేదు. ఇక, ఓడిపోయిన దేవినేని ఉమా మాత్రమే ఒకింత మాట్లాడినా .. అవి ప్రభావం చూపించలేక పోయారు. ఈ పరిణామంతో నిజంగానే వంశీ చెప్పినట్టు పార్టీలో లోకేష్‌పై అందరికీ ఇదే అభిప్రాయం ఉందా? అనే సందేహాలకు దారితీస్తోంది. మరి దీనిపై చంద్రబాబు కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.