మళ్లీ అక్కడ నుంచే బరిలోకి దిగుతానంటున్న నారా లోకేష్…

-

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు ఉండగా.. ఇప్పుడే ప్రచారం ప్రారంభించారా అన్న రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో ముఖ్యంగా టీడీపీ, అధికార వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇరుపార్టీలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుతున్నాయి. తాజాగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో టీడీపీ పర్యటిస్తూ పలు రాజకీయ హామీలు చేస్తుండటం.. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారా.. అనే అనుమానం వస్తుంది.

తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి టీడీపీ నేత నారా లోకేష్ తన మనసులో మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంగళ గిరిలో పర్యటిస్తున్న ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి సాయం చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి, సీఎం జగన్ లాగా నేను మాట తప్పనని.. ఎన్ని కష్టాలు వచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

కాగా అంతకుముందు 2019 ఎన్నికల్లో టీడీపి తరుపున నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. వైఎస్సాఆర్సీపీ పార్టీ అభ్యర్తి ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి చేతిలో నారాలోకేష్ 5300 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version