ఏపీ ప్రజలు అధైర్య‌ప‌డొద్దు..చంద్రబాబు మీ కోసం వస్తున్నారు – నారా లోకేష్‌

-

ఏపీ ప్రజలు అధైర్య‌ప‌డొద్దు..చంద్రబాబు మీ కోసం వస్తున్నారని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. సంక్షోభాల్ని ఎదుర్కొని సంక్షేమం సృష్టించే దార్శ‌నికుడు, ప్ర‌కృతివిప‌త్తులు వ‌స్తే ప్ర‌జ‌ల్ని కాపాడే ర‌క్ష‌కుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు గారు. ప్ర‌భుత్వంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్ర‌జాప‌క్ష‌మే అని పేర్కొన్నారు.

వైసీపీ స‌ర్కారు నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌లు నిండా మునిగారు. జ‌గ‌న్‌రెడ్డి నాలుగు బంగాళాదుంప‌లు ఇచ్చి చేతులు దులుపుకుంటే…చంద్ర‌బాబు గారి ఆదేశాల‌తో తెలుగుదేశం కేడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కూ అంతా వ‌ర‌ద స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారని వెల్లడించారు. వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు, నిర్వాసితుల స‌మ‌స్య‌లు తెలుసుకుని ప్ర‌భుత్వంతో పోరాడి ప‌రిష్క‌రించేందుకు, అధైర్య‌ప‌డొద్దు అండ‌గా వుంటానంటూ భ‌రోసా ఇచ్చేందుకు చంద్ర‌బాబు గారు వ‌స్తున్నారని స్ఫష్టం చేశారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version