లాంచ్‌ అయిన Panasonic Toughbook 40..కాస్ట్‌ మరీ అంతా..?

-

ఇండియాలో ప్యానసోనిక్‌ కొత్త రగ్డ్‌ ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. అదే Panasonic Toughbook 40. ఆర్మీలో ఎక్కువగా ఇలాంటి ల్యాప్‌టాప్‌నే వాడతారు. ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకునే వీలుగా ల్యాప్‌టాప్‌ విడుదలైంది.
ప్యానసోనిక్ టఫ్‌బుక్ 40 ధర..
దీని ధరను రూ.3.75 లక్షలుగా నిర్ణయించారు. ప్యానసోనిక్ డిస్ట్రిబ్యూటర్స్, సిస్టం ఇంటిగ్రేటర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందు ఈ సిరీస్ వచ్చిన ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువ బరువుతోనే ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఈ ల్యాప్‌టాప్‌పై ఏమైనా ఆఫర్లు ఉన్నాయో, లేవో ఇంకా కంపెనీ ప్రకటించలేదు.
ప్యానసోనిక్ టఫ్‌బుక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 14 అంగుళాల పుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు.
డిస్‌ప్లే కూడా పెద్దగా ఉంది. మెరుగైన స్క్రీన్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఐ5, ఐ7 వీ ప్రో ప్రాసెసర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. ఆప్షనల్ ఏఎండీ డెడికేటెడ్ గ్రాఫిక్స్ లేదా ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ కూడా ఈ ల్యాప్‌టాప్‌తో పొందవచ్చు.
దీని గ్రాఫిక్స్ ఎక్కువ మొత్తంలో డేటా, ఇమేజెస్, వీడియో ఫీడ్స్‌ను ప్రాసెస్ చేయగలదు.
ఇందులో రెండు బ్యాటరీలు ఉండనున్నాయి. రెండూ కలిపి ఏకంగా 36 గంటల బ్యాకప్ లభించనుంది. ఒక బ్యాటరీ నుంచి ఇంకో బ్యాటరీకి మారేటప్పుడు కూడా ల్యాప్‌టాప్ పవర్ ఆఫ్ కాకుండా ఉంటుంది.
ఐపీ66 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఈ ల్యాప్‌టాప్ పొందింది.
1.8 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డా ఏమీ కాదని కంపెనీ అంటోంది.
గతంలో ప్యానసోనిక్ ఎస్1 ట్యాబ్లెట్ టఫ్‌బుక్‌ను రగ్డ్ బిల్ట్‌తో లాంచ్ చేసింది. దీని ధరను రూ.98,000గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఈ ట్యాబ్లెట్ ఒక్కసారి చార్జ్ పెడితే 14 గంటల బ్యాకప్‌ను అందించనుంది.
ఈ ల్యాప్‌టప్‌ కాస్ట్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం..దాని స్పెషల్‌ ఫీచర్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version