మాతృమూర్తి ప్రేమ‌లో మోడీ ..విప‌క్షాల విమ‌ర్శ‌లు ఎందుకు ?

-

అమ్మ‌ను చూసి వ‌చ్చారు మోదీ
అదే ఇప్పుడు విప‌క్షాల విమ‌ర్శ‌కు కార‌ణం…

ఏ ప‌ని చేసినా ప‌బ్లిసిటీకి వాడుకోవ‌డం
ఆయ‌న‌కు తెలిసిన విద్య అని విప‌క్షం పెద‌వి విరుస్తోంది…

కానీ అదేం కాదు ఆయ‌నపై అమ్మ చూపించే
ప్రేమ వాత్స‌ల్యం అన్న‌వి అనంతం
అని, అందుకే ఆయ‌న త‌రుచూ కాక‌పోయినా
వీలున్నంత వ‌ర‌కూ వెళ్లి త‌న మాతృమూర్తి ఆశీర్వాదం
తీసుకుంటున్నార‌ని అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు…

దేశాన్ని పాలించే నాయ‌కులు ఇచ్చే సందేశాన్ని కూడా..
చిత్ర,విచిత్ర ధోర‌ణిలో వ్యంగ్య భాష్యం చెప్ప‌కూడ‌దు అన్న‌ది బీజేపీ హిత‌వు.

నరేంద్ర మోదీ ఈ ఒక్క పేరు చాలు..దేశంతో పాటు ప్రపంచంలో ఎంతో క్రేజ్.అతి సామాన్య కుటుంబం నుంచి ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే  అతిపెద్ద, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఒకటి కాదు రెండు సార్లు తన పార్టీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.దేశంలో మోదీకి ఉన్న ఫాలోయింగ్ మరే నేతకు కూడా లేదు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని 5 రాష్ట్రాల ఎన్నికలు చాటి చెప్పాయి.ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్,గోవా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారం చేపట్టనుంది.

సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలే మరోసారి 2024లో కూడా రిపీట్ అవుతాయని మోదీ అన్నారు. ఇక పలువురు ప్రముఖ జర్నలిస్టులు అయితే విపక్షాలు 2024 ఎన్నికల గురించి మర్చిపోవాలని.. 2029 ఎన్నికల గురించి ఆలోచించాలని సలహాలు ఇస్తున్నారు.. అంటే దేశంలో మోదీ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే స‌మ‌యాన మోదీ విమర్శకులు కూడా దేశంలో తక్కువగా లేరు.ఆయన తన ఫ్యామిలీని ప‌ట్టించుకోరంటూ.. ప్రతిపక్షాలు త‌రుచూ ఆరోపిస్తుంటాయి.తన తల్లికి దూరంగా ఉంటున్నారనే అపవాదు కూడా ఉంది. అయితే మోదీ అంటే తెలిసిన వాళ్లు మాత్రం.. ఆయన తన తల్లి కన్నా తల్లిలాంటి దేశానికి ఎంతో ప్రాధాన్యంఇస్తుంటారని చెబుతుంటారు. కాగా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ మోదీ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది.

తను భార్యకే న్యాయం చేయలేని మోదీ.. మహిళలకూ, దేశానికీ..ఏం న్యాయం చేస్తారని.. కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ వీటిని మోడీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. జశోదాబెన్ మోదీ కూడా ఎప్పుడూ నరేంద్ర మోదీపై కానీ ఇతరులపై కానీ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. ప్రతిపక్షాలు ఇంతలా ప్రచారం చేసినా కూడా మహిళా లోకం మోదీ వైపే నిలిచింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేసి ముస్లీం మహిళలకు న్యాయం చేశారు. యూపీలో ఆడవాళ్ల పట్ల దారుణాలను పాల్పడే వారిని అణచివేశారు.దీంతో ఈసారి యోగీకి గంపగుత్తగా మహిళా ఓట్లు పడ్డాయి. వీట‌న్నింటి వెనుకా మోడీ వ్యూహం కూడా ఉంది.ఆయ‌న మ‌ద్దతు కూడా ఉంది.

ఇక మోదీ తల్లి హీరాబెన్ మోదీ ప్రస్తావన కూడా చాలా సార్లు ప్రతిపక్ష నాయకులు తీశారు.తన తల్లిని పట్టించుకోరని విమర్శించారు.కానీ ఆయ‌న ఎప్పుడు గుజరాత్ వెళ్లినా.. ఎన్నికల్లో గెలిచినా..తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు మోదీ.తాజాగా గాంధీనగర్ వెళ్లిన మోదీ మరోసారి తన మాతృమూర్తికి పాదాభివందనాలు చేశారు.గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కుటుంబం గురించి తెలియని,పుత్ర వాత్సల్యం గురించి తెలియని మోదీ..కుటుంబ రాజకీయాల గురించి విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.ఎవరెన్ని విమర్శలు చేసినా..మోదీ తాను చేయాలనుకునేది చేస్తూనే పోతున్నారు.వ‌రుస విజ‌యాలు న‌మోదు చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version