సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ -1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సి బి ఎస్ సి ఆన్లైన్ లో విడుదల చేయలేదు. నేరుగా స్కూళ్లకు మార్పు సీట్లను పంపిస్తామని అక్కడికి వెళ్లి తీసుకోవచ్చని సీబీఎస్ఈ ప్రకటన చేసింది.
Http://cbseresults.nic.in/ lo మారుతి సీట్లు అప్ లోడ్ చేసాక విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్సీ స్పష్టం చేసింది. కాగా గత సంవత్సరం నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా నిన్న పదవ తరగతి అలాగే 12వ తరగతి టర్మ్ 2 పరీక్షల తేదీలను సి బి ఎస్ సి విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26వ తేదీ నుంచి 2022 న ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. అలాగే మే 24వ తేదీన ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్లో ప్రకటించింది సిబీఎసి.