మోదీ క్రేజ్ మామూలుగా లేదుగా… తాజా సర్వేలో వెల్లడి

-

ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా లేదు. ప్రపంచ దేశాధి నేతల్లో ఎవరికి లేని క్రేజ్ మోదీ సొంతం. తాజా మార్నింగ్‌ కన్సల్ట్‌ చేసిన సర్వేలో ప్రపంచంలోనే అత్యధిక క్రేజ్ కలిగిన నేతల్లో మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ దేశాల నేతల్లో ఎక్కువగా ఇష్టపడే నాయకుల జాబితాలో మోదీ ముందు వరసలో ఉన్నారు. దాదాపు 70 శాతం మంది ప్రజల ఆమోదంతో ఇది సాధ్యమైంది. మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేలో ఈవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర ప్రపంచ దేశాల నాయకులతో పోలిస్తే మోదీ మొదటిస్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ’కూ‘ యాప్ ద్వారా తెలిపారు.

ఈ లిస్ట్‌లో ప్రపంచంలోని ఇతర దేశాల ప్రముఖ నాయకులు ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ దేశాల నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది. ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే కూడా ప్రధాని మోడీ ముందున్నట్లు సర్వేలో తేలింది. కాగా, ప్రతి దేశంలోని కొంతమంది ప్రజల ఇంటర్వ్యూల ఆధారంగా మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ సర్వే చేపట్టింది. మార్నింగ్ కన్సల్ట్ ఇండియాలో 2,126 మందిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఇంటర్య్వూల ఆధారం ప్రపంచ దేశాల నేతలకు రేటింగ్స్ ఇచ్చింది.

ప్రపంచంలో వివిద దేశాధినేతల రేటింగ్స్

  1. నరేంద్ర మోదీ( ఇండియా)-70 శాతం
  2. లోప్ ఒబ్రాడర్ ( మెక్సికో)-66 శాతం
  3. మారియో డ్రాగి( ఇటలీ)-58 శాతం
  4. ఏంజెలా మెర్కెల్( జర్మనీ)- 54 శాతం
  5. స్కాట్ మోరిసన్( ఆస్ట్రేలియా)-47 శాతం
  6. జస్టిన్ ట్రూడో( కెనడా)-45 శాతం
  7. జో బిడెన్( యూఎస్ఏ)-44 శాతం
  8. ఫ్యూమిడా కిషిడా( జపాన్)-42 శాతం
  9. మూన్ జే ఇన్(సౌత్ కొరియా)-41 శాతం
  10. బోరిస్ జాన్సన్( బ్రిటన్)-40 శాతం
  11. ఇమాన్యుయల్ మక్రాన్( ఫ్రాన్స్)-36 శాతం
  12. జైర్ బోల్సినారో ( బ్రెజిల్)-35 శాతం

 

Read more RELATED
Recommended to you

Exit mobile version