ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా… మోడీ మాస్ట‌ర్ మైండ్‌

-

శాంతికాముక దేశంగా భార‌త్‌ను నిలుపుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ…రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా సాగుతున్న యుద్దం ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భార‌త్ చుట్టూ ఉన్న చిన్న దేశాల్లో అల్ల‌క‌ల్లోలం జ‌రుగుతున్నా ఏమాత్రం ఆవేశాల‌కు పోకుండా ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మోడీ.ఇదే క్ర‌మంలో ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాన్ని ఆపే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు మోడీ.

రష్యా.. ఉక్రెయిన్ ఈ రెండు దేశాలూ భార‌త్‌కు సన్నిహిత దేశాలే కావడంతో ఈ యుద్ధాన్ని విరమింపజేసేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే ఇరుదేశాల్లో పర్యటించారు. ఇరు దేశాధినేతలు పుతిన్, జెలెన్ స్కీతోనూ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. భారత్ విధానాన్ని వారికి వివరిస్తూనే యుద్దం విరమించాల్సిన అవసరాన్ని ఇద్దరికీ గుర్తుచేశారు. దీనిపై వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంతో న‌రేంద్ర‌ మోడీ మరో అస్త్రం ప్రయోగించబోతున్నారు.యుద్ధం ఆప‌డ‌మే ల‌క్ష్యంగా మాస్ట‌ర్‌మైండ్‌ను రంగంలోకి దించుతున్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్దం వ‌ల‌న ఇప్ప‌టికే ఆ రెండు దేశాలు చాలా న‌ష్ట‌పోయాయి.అందుకే యుద్ధం ఆపేందుకు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు వీలుగా మధ్యవర్తిత్వం నెరపాలని భావిస్తున్న ప్రదాని మోడీ తన తురుపుముక్క, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను మాస్కోకు పంపుతున్నారు.ఈ వారంలో మాస్కో బయలుదేరి వెళ్లేందుకు ధోవల్ కూడా సిద్ధమవుతున్నారు. రష్యా అధినేత పుతిన్ తో తాజా ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ధోవల్ ఎప్పుడు వెళ్తున్నారనే వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు.మోడీ వైఖ‌రితో అమెరికా కూడా యుద్ధ్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను విర‌మించింది.చైనా మాత్రం యుద్ధం చేయాల్సిందేన‌ని ఉక్రెయిన్‌ను రెచ్చ‌గొడుతోంది.అటు పాకిస్తాన్ కూడా ఇదే త‌ర‌హా స్ఫూర్తిని నూరిపోస్తోంది. కానీ ఎవ్వ‌రు కూడా రెండు దేశాల్లో ప‌ర్య‌టించి యుద్ధం నిలుపుద‌ల చేసే విధానాల‌పై చ‌ర్చించ‌లేదు.

కానీ బ‌య‌టి నుంచి ఇరు దేశాల‌ను రెచ్చ‌గొడుతున్నారు.మోడీ మాత్రం రెండు దేశాల‌కు భ‌రోసాగా నిల‌బ‌డుతూ యుద్ధాన్ని ఎలా ఆప‌గ‌ల‌మో అలాంటి విధానాల‌పై చ‌ర్చిస్తున్నారు.ఉక్రెయిన్‌లో మోడీ ప‌ర్య‌టిస్తున్న టైమ్‌లో ర‌ష్యా తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేసింది. మోడీ ఉక్రెయిన్ నుంచి తిరిగి రాగానే మళ్ళీ ఉక్రెయిన్‌పై బాంబుల‌తో విరుచుకుప‌డింది. అయితే ఈ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని మోడీ యోచిస్తున్నారు.

యుద్ధాన్ని ఆప‌డ‌మే ల‌క్ష్యంగా ప్రధాని మోడీ ఇటీవ‌ల రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో జరిపిన శాంతి చర్చలపై అంతర్జాతీయంగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా దౌత్యపరంగా భారత్ వేస్తున్న అడుగులపై చాలా దేశాల నుంచి మంచి స్పందనే వస్తోంది. నియంతలా వ్య‌వ‌హ‌రిస్తున్న నార్త్ కొరియా అధ్య‌క్షులు కిమ్ కూడా భార‌త్‌కు మ‌ద్ధ‌తుగా నిల‌బ‌డుతున్నారు.అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇది మరింత పెంచుతుందని కేంద్రం కూడా నమ్ముతోంది. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అదే జరిగితే అంతర్జాతీయ శాంతిదూతగా భారత్ నిలిచిపోతుందనే అంచనాలున్నాయి.మరోవైపు ఉక్రెయిన్ వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారతదేశం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనని ఇతర ప్రపంచ నాయకులు కూడా నమ్ముతున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉక్రెయిన్లో ప‌ర్య‌టిస్తూ ఆ దేశ‌ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన చర్చల్లో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు. ఉక్రెయిన్‌ను దాని విధికి వదిలివేయడం ద్వారా వివాదాన్ని పరిష్కరించవచ్చని ఇటలీ కూడా భావిస్తోంది.మ‌రి మోడీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని యావ‌త్ భార‌త ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version