పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపే విచారణ

-

ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్ లపై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.

ఈ పిటిషన్ పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు వీరిపై అనర్హత వేటు వేస్తే రాజీనామా చేస్తారా..? లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా..? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version