రూ.22 వేలుతో…రూ.65 లక్షలు.. ఎలా అంటే..?

-

చాలా మంది డబ్బులని స్కీమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా మనం లాభాలని పొందొచ్చు. అయితే ఇక్కడ మీకోసం ఒక సూపర్ స్కీమ్ వుంది. దీనిలో కనుక డబ్బులు పెడితే ధనవంతులు అయిపోవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం వస్తుంది. అయితే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే పథకాన్ని తీసుకు వచ్చింది. రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా దీనితో పొందొచ్చు. అలానే మంచిగా రాబడి కూడా వస్తుంది. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వుంది. తర్వాత ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. ఈ స్కీమ్ లో చేరి 30 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనీ అనుకుంటే నెలకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తే 10 శాతం రాబడిని అంచనా వేసుకుంటే మెచ్యూరిటీ సమయంలో రూ.1.1 కోట్లు వస్తాయి. ఇందులో రూ. 45 లక్షలను యాన్యుటీ ప్లాన్‌లో పెట్టారు.

ఇప్పుడు మీకు ప్రతి నెలా రూ.22 వేలకు పైగా పెన్షన్ వస్తుంది. అలాగే మిగిలిన రూ. 68 లక్షలు కూడా వస్తాయి. గరిష్టంగా 75 ఏళ్ల వరకు ఎన్‌పీఎస్ అకౌంట్‌ను నడపచ్చు. ఎవరు అర్హులు అన్నది చూస్తే 18 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న వారు ఈ స్కీమ్ లో చేరచ్చు. మీ భార్య పేరుపై కూడా ఎన్‌పీఎస్ ఖాతాను ఓపెన్ చెయ్యచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో చేరాలంటే బ్యాంక్‌కు వెళ్లి ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. మెచ్యూరిటీ అమౌంట్‌లో కనీసం 40 శాతం మొత్తాన్ని కచ్చితంగా యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version