తెలంగాణ డయాగ్నొస్టిక్స్ కు జాతీయ గుర్తింపు

-

kcr ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ గుర్తింపు దక్కింది. నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు/ రోగులకు రోగనిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలను ప్రారంభించింది.

పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్ కు మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాల్బ్రేషన్ లేబోరేటరీస్ సర్టిఫికేషన్ లభించింది. దీనిపై ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో అన్ని జిల్లాల్లో ప్రారంభమై 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version