మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన భవన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. అందులో ఏడుగురు మగవాళ్ళు, 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల నుంచి మంగళవారం నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడగా అతని తల్లి, ఇద్దరు సోదరిలు విగతజీవులై కనిపించారు. దీంతో సంఘటనా స్థలంలో విషాదం అలుముకుంది. ఇప్పటివరకు 60 మందిని కాపాడారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయక చర్యలు జరుగుతున్నారు. ఇకపోతే ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.