గత కొద్ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. మరికొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ నీటితో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక తాజాగా రాజస్థాన్ సవాయ్ మాదోపూర్ లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సుర్వాల్ జలాశయం ఉప్పోంగి ఏకంగా రెండు కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా అటు జడవట గ్రామంలో కూడా విద్వాంశం నెలకొంది. చాలా వరకు ఇల్లు నేలమట్టమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరద ఉధృతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. వారికి ప్రభుత్వం అండగా నిలవాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాధపడుతున్నారు.