నిరుద్యోగులకు గుడ్న్యూస్.. కొత్తగా మూడు పథకాలు

-

కేంద్ర ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. నిరుద్యోగుల కోసం మూడు పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు అందించనున్నట్లు చెప్పారు.

ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు ఉంటుందని చెప్పారు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులని వివరించారు. దీనిద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ అందిస్తామని.. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version