సూరత్ ఎయిర్​పోర్టులో 45 కిలోల గోల్డ్ సీజ్

-

గుజరాత్​లోని సూరత్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 27 కోట్లు విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 45 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి, హ్యాండ్​ బాగుల్లో అక్రమంగా తరలిస్తున్న నలుగురిని పట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే.. దుబాయ్- షార్జా నుంచి వస్తున్న విమానంలో అక్రమ బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో డీఆర్​ఐ అధికారులు సూరత్​ విమానాశ్రయం చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారి హ్యాండ్ బ్యాగ్​లో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పేస్ట్ రూపంలో 45 కిలోల బంగారం లభ్యమైంది. వెంటనే నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 27 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరిని సూరత్​లోని రాందేర్​కు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుకున్న వాటిలో ఇదే అతిపెద్దదని అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version