హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు !

-

హనీ ట్రాప్‌లో 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు.. ఇరుక్కున్నారు. జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న. 48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపారు సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.

48 Karnataka MLAs caught in honey trap

దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేసారు మంత్రి రాజన్న. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపారు మంత్రి సతీశ్ జారి హోళీ. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పందించారు డిప్యూటి సీఎం డీకే శివకుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news