అయోధ్య​​ బాలక్​రామ్​ను దర్శించుకున్న 75లక్షల మంది భక్తులు

-

అయోధ్య రామయ్యను ప్రాణప్రతిష్ఠ ఈ ఏడాది జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు భక్తులకు రామయ్యను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 75 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను సందర్శించుకొన్నట్లు అధికారులు తెలిపారు. మంగళ, శని, ఆదివారాల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకుంటున్నారని వెల్లడించారు. మిగతా రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నారని వివరించారు.

\

మరోవైపు ​ అయోధ్యలోని రామాలయ దర్శన వేళల్లో ట్రస్టు ఇటీవలే మార్పులు చేసింది. అయోధ్య రామ్‌లల్లా ఆలయంలో బాల రాముడి దర్శనానికి ఇకపై ప్రతిరోజు గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version