ఒడిస్సాలో మూడు రైలు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రిలే రూములు, సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబ్బులు లాకింగ్ ఏర్పాట్లు చేయాలని.. లోపల ఉంటే తెలియజేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. రిలే రూముల తలుపులు తెరవడం లేదా మూసివేయడం కోసం డేటా లాగిన్ వంటివి కూడా తనిఖీ చేయాలను సూచించింది.
కాగా, ఒడిస్సా రైలు ప్రమాదానికి సిగ్నల్ లోపం కారణమని తెలుస్తుండగా… దీనిపై 3 నెల క్రితమే ఓ అధికారి రాసిన లేఖ బయటకు వచ్చింది. గతంలో పశ్చిమ మధ్య రైల్వే లో పనిచేసిన హరి శంకర్… ఇంటర్ లాకింగ్ కోసం రూపొందించిన సిస్టం ను బైపాస్ గా మార్చగా లొకేషన్ బాక్సులో లోపాలు గుర్తించారు. దీన్ని నిలిపివేయాలని రైల్వే బోర్డును ఆయన కోరారు. రైలు బయలుదేరాక డిస్పాచ్ రూట్ మారుతోందని… దీనివల్ల ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కానీ ఆయన మాట రైల్వే శాఖ వినలేదట. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.