ఎన్టీఆర్ జిల్లాలో ఆగని కిడ్నీ మరణాలు

-

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో కిడ్నీ మరణాలు ఆగడం లేదు. ఎ.కొండూరులో కిడ్నీవ్యాధితో మరొకరి మృతి చెందారు. ఎ.కొండూరు మండలం గొల్లమందల తండాకి చెందిన భూక్య కాళో(60) కిడ్నీవ్యాధితో మృతి చెందారు. గొల్లమందల తండాకు చెందిన భూక్యా కాళో (60) గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.

సీరం క్రియాటిన్ శాతం పెరగడంతో వైద్యులు డయాలసిస్ తో వైద్య సేవలు పొందుతున్నారు. క్రియాటిన్ శాతం 8.5కి పెరిగి తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడికి బుధవారం వివాహం జరగాల్సి ఉండగా కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పెళ్లి కూడా వాయిదా పడింది.

ఏ కొండూరు మండలంలో ఎంతోమంది కిడ్నీవ్యాధితో చనిపోతున్నారు అయిన కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మృతిని కుమార్తె రాధ ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఏ.కొండూరులో కిడ్నీవ్యాధితో బాధపడేవారిని ఆదుకోవాలని,కిడ్నీవ్యాధికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశౄరు మృతిని కుమార్తె రాధ.

Read more RELATED
Recommended to you

Exit mobile version