ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం ఇవ్వండి : నటుడు దర్శన్

-

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న  కన్నడ స్టార్ నటుడు దర్శన్ తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం ఒంటికి సరిపడడం లేదని అన్నారు. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను ఉన్నత న్యాయస్థానం జులై 18వ తేదీకి వాయిదా వేసింది.

చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఆయన ప్రస్తుతం పరప్పన అగ్రహార కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జైల్లో ఇస్తున్న భోజనం తింటే తనకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని, బరువు కూడా తగ్గిపోతున్నానని దర్శన్‌ ఆక్రోశిస్తూ, తన న్యాయవాదుల సహకారంతో ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశారు. ఇంటి భోజనం, పరుపు, చదువుకునేందుకు పుస్తకాలు తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని వేసుకున్న అర్జీని జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కారాగారం రూల్‌ బుక్‌లో ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు ఎటువంటి నియమాలు ఉన్నాయని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version