దీదీ విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్‌ రంజన్‌

-

ఇండియా కూటమికి మద్దతు విషయంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వైఖరేంటో స్పష్టతనివ్వాలని ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధ్రీ అడిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అగ్రనాయకత్వం తనను సంయమనం పాటించాలని చెబుతోందని, స్వయంగా ఖర్గే చెప్పినా ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని అధీర్ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ గురించి ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా మాట్లాడలేనని పేర్కొన్నారు.

‘‘నన్ను, నా పార్టీని(కాంగ్రెస్‌)ను రాష్ట్రంలో రాజకీయంగా అంతం చేయాలనుకునేవారి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా మాట్లాడలేను. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కోసం పోరాడుతా. వారి పక్షానే మాట్లాడుతా. మమతా బెనర్జీపై వ్యక్తిగత కక్ష లేదని..అయినా, ఆమె రాజకీయ నైతికతను ప్రశ్నిస్తాను’’ అని అధిర్‌ పేర్కొన్నారు.  మరోవైపు ఖర్గే వ్యాఖ్యలపై అధిర్‌ స్పందిస్తూ .. తాను తమ పార్టీ నాశనం కోసం పనిచేయాలనుకోవడం లేదని, ఒక వేళ ఖర్గే తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా.. తాను మాత్రం క్షేత్ర స్థాయిలోని కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం మాట్లాడుతూనే ఉంటానని అధీర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version