ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తేనే మంచి జరుగుతుంది – ఈటల రాజేందర్‌

-

ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తేనే మంచి జరుగుతుందన్నారు ఈటల రాజేందర్‌. నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈటల రాజేందర్. నల్లగొండలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… పోటీచేసిన అభ్యర్థులు అందరికీ ఓటు వేసే అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది…అందుకే మనం కూడా ప్రతి ఒక్కరినీ కలవాలని కోరారు. ప్రేమేందర్ రెడ్డి 40 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. పార్టీ, ప్రజలు తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి అన్నారు.

Nalgonda Khammam Warangal Graduate MLC Etala Rajender campaigned on behalf of Premender Reddy who is contesting as a BJP candidate

భారత రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు ఇర్రలవెంట్ ఆ పార్టీ వారి గురించి ప్రజల్లో చర్చ లేదు.కెసిఆర్ తీరును అర్థం చేసుకున్న తర్వాత ఆయనను గౌరవించడం అధర్మం, కొనసాగించడం రాష్ట్రానికి క్షేమమే కాదు అని ప్రజలు ఇంటికి పంపించారని చురకలు అంటించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది….ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ.. అనేక స్కాములకు.. అవినీతి కార్యక్రమాలకు నెలవు .. 40 ఏళ్లపాటు సగటు భారతీయుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గతిలేక ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. వారి డాబు దర్పం వసూలు మళ్లీ మొదలయ్యాయి.ఎంతకాలం ఈ దౌర్జన్యం భరించాలో అని భయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన వాడిని అని వెల్లడించారు. అనేక రిఫమ్స్ ని తీసుకొచ్చింది వాజ్పెయి ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధికి పునాది వేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version