కుటుంబాన్ని మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలితీసుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు.

దింతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా, విమాన ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూప్. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్. బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది.