Amazon Prime Day Sale .. ఆ క్రెడిట్‌ కార్డు ఉంటే భారీ క్యాష్‌ బ్యాక్‌

-

Amazon Prime Day Sale ఇంకో రెండు రోజల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భారీగా క్యాష్‌ బ్యాక్ పొందాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రతీ ఏటా రెండు రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ డే పేరుతో ఈ సేల్ ప్రతీ ఏటా జరుగుతుంది. జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది.

Amazon Prime Day Sale

ఈ సేల్‌లో అమెజాన్‌లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఇక కేవలం ప్రైమ్ మెంబర్స్‌కి మాత్రమే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ (Amazon Pay ICICI Credit Card) అందుబాటులో ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి అదనంగా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఈ క్రెడిట్ కార్డుతో ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో తెలుసుకోండి

అమెజాన్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ కలిసి అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పేరుతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంఛ్ చేశాయి. అమెజాన్‌లో తరచూ షాపింగ్ చేసేవారికి అదనంగా డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రెడిట్ కార్డ్ ఇది. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఛార్జీలు ఉండవు. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ క్రెడిట్ కార్డుతో అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో యాడ్ అవుతుంది. అమెజాన్‌లో బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ చేసినా, డబ్బులు యాడ్ చేసినా 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇక ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ పే ద్వారా పేమెంట్స్ చేస్తే 2 శాతం, కార్డుతో ఇతర పేమెంట్స్ చేస్తే 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 1 శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మినహాయింపు ఉంటుంది. పార్ట్‌నర్ రెస్టారెంట్లలో డైనింగ్ బిల్ చేస్తే కనీసం 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు తీసుకున్నవారికి రూ.2,500 విలువైన రివార్డ్స్ లభిస్తాయి. రూ.2,500 వెల్‌కమ్ రివార్డ్స్‌తో పాటు 3 నెలల ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా లభిస్తుంది. వీడియో కేవైసీ అప్లికేషన్ ద్వారా వెంటనే ఈ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. అమెజాన్‌లో మొదటి షాపింగ్ లేదా మొదటి బిల్ పేమెంట్ చేస్తే రూ.300, అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 25 శాతం లేదా రూ.200, ప్రీపెయిడ్ రీఛార్జెస్ చేస్తే 50 శాతం లేదా రూ.100 వరకు, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్‌కు 25 శాతం లేదా రూ.300 వరకు, గ్యాస్ సిలిండర్ పేమెంట్‌పై 10 శాతం లేదా రూ.150 వరకు, డీటీహెచ్ రీఛార్జ్‌పై 25 శాతం లేదా రూ.250 వరకు, బ్రాడ్‌బ్యాండ్ బిల్ పేమెంట్‌పై 25 శాతం లేదా రూ.400 వరకు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్‌పై 20 శాతం లేదా రూ.250 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేనివాళ్లు కూడా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. వారికి బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి. అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం కాకుండా 3 శాతమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎవరైనా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకునేవారి వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌లో లేదా అమెజాన్ పే సెక్షన్‌లో క్రెడిట్ కార్డ్ బ్యానర్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version