ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు.. మరోసారి అమెరికన్‌ సింగర్‌ ప్రశంసలు

-

సార్వత్రిక సెమీ ఫైనల్​లో జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై ప్రముఖ అమెరికన్‌ పాప్ సింగర్‌ మేరీ మిల్బెన్‌ స్పందించారు. మరోసారి ఆమె ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ మేరీ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా కొనియాడారు.

మూడు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసిన మిల్బెన్‌ .. బీజేపీ మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించిందని ట్వీట్​లో పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీకి ప్రజలు ఇచ్చిన గొప్ప విజయమని అన్నారు. అమెరికా- భారత్‌ సంబంధాలను మరింత మెరుగుపరచగల ఉత్తమ నాయకుడు మోదీ అంటూ కీర్తించారు.

కొన్ని నెలల కిత్రం అమెరికాలో ప్రధాని మోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో మిల్బెన్ పాల్గొని భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version