కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బస్తర్ పాండుమ్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రసంగిస్తూ.. నక్సల్స్ లొంగిపోయేలా చేసే గ్రామాలకు కోటి రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని షా ప్రకటించారు. ఈ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధిని నక్సలైట్లు అడ్డుకోలేరని అన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
లొంగిపోయే నక్సల్స్ సాధారణ జీవితం గడపొచ్చు. మీరు లొంగిపోకపోతే ఉద్యమంలో మిగిలిపోయిన అతి కొద్దిమందిని త్వరలోనే భద్రతాదళాలు పట్టుకుంటాయి. ఆయుధాలతో గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవద్దు. మార్చి 2026 నాటికి నక్సల్ ముప్పును నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్తర్‌లో బుల్లెట్లు, బాంబులు పేల్చిన రోజులు పోయాయి. నక్సలైట్ సోదరులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను కోరుతున్నాను. మీరు మా సొంత వారు. మీకు ఏమైనా జరిగితే ఎవరూ సంతోషంగా ఉండరు. అందుకే నక్సలిజం వీడి జనాల్లో కలవండి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితాన్ని గడపండి. అంటూ అమిత్ షా పిలుపునిచ్చారు.