ఆహా!! అంబానీలా మజాకా.. అనంత్-రాధిక వెడ్డింగ్ ఫుడ్ మెనూ చూశారా?

-

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ – రాధిక మార్చెంట్‌ల నిశ్చితార్థం మొదలు, ప్రీ వెడ్డింగ్‌ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతోంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ నుంచి వివాహ వేదిక, దుస్తులు, అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్లా ఉంటున్నాయి. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమంలో, అతిథులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు.

జులై 12న ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించిన మొత్తం మెనూ గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. కానీ వీటిలో కొన్ని వంటకాల వివరాలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారణాశిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్‌ స్టాల్‌ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చాట్‌ బండార్‌ యజమానే స్వయంగా ముఖ్య అతిథుల (వీఐపీ)కు వడ్డించనున్నారట. కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా చాట్‌, పాలక్‌ చాట్‌, చనా కచోరి, దహీ పూరి, బనారస్‌ చాట్ లాంటి స్పెషల్స్ అంబానీ మెనూలో ఉన్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version