2019 ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ “మోడీలందరూ దొంగలని” చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ప్రదీప్ మోడీ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోడీ వంశంపై చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తెల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడి.. లోక్సభలో అనర్హత వేటుపడిన రాహుల్ గాంధీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో మూడు కేసుల్లో విచారణకు హాజరు కావాలని కోరుతూ జార్ఖండ్ దిగువ కోర్టులు సమన్లు జారీ చేశాయి. మోడీ వంశంపై చేసిన వ్యాఖ్యలకు గాను ఓ కేసు నమోదు కాగా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను మిగిలిన రెండు కేసులు నమోదయ్యాయి.