BREAKING: అమెరికాలో మరో తెలుగు యువతి మృతి

-

అమెరికాలో మరో తెలుగు యువతి మృతి చెందింది. అమెరికాలో గత నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. ఇక తాజాగా అమెరికాలో మరో తెలుగు యువతి మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్ల హామాలో ఎంఎస్ చేస్తున్న హారిక(24) అనే యువతి.. నిన్న వర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

Another young Telugu woman died in America

ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆమె మరణించగా.. మిగతావారికి గాయాలయ్యాయి.. మృతురాలు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక(24)గా గుర్తించారు. దీంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version