మోడీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే

-

భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం…ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్తున్న మాట ఇది. మరొక్కసారి దేశాన్ని పరిపాలించే అవకాశం ఇస్తే భారత్ ను మరింత పటిష్టంగా మార్చే గట్టి సంకల్పం తీసుకున్నారు మోదీ.అమెరికా, రష్యా, చైనా,జపాన్…వంటి దేశాలు బలమైన స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగిఉన్నాయి.మరి భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం సులభమయ్యే పనేనా… అసలు మోడీ సంకల్పం వెనుక ఉన్న రహస్యo ఏమిటి… భారత్ కు గల సానుకూల అంశాలు ఏమిటి…

మొన్ననే జపాన్ ను వెనక్కి నెట్టిన జర్మనీ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కోల్పోయింది. దీంతో మరో స్థానం మెరుగుపరచుకున్న జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. వృద్ధుల సంఖ్య పెరగడంతోపాటు పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనవుతోంది.

పోటీతత్వాన్ని, ఉత్పాదకతను జపాన్ పెద్ద మొత్తంలో కోల్పోతోంది.డాలర్‌తో పోలిస్తే యెన్‌ విలువ పతనం కావడంతో జపాన్‌ ఆర్థిక పరిస్థితి బలహీన పడింది. డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ 2022లో దాదాపు 20 శాతం క్షీణించగా, 2023లో ఏడు శాతం పడిపోయింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది.ఇప్పుడు జపాన్ నాలుగో స్థానంలో ఉంది.మూడో స్థానానికి వచ్చిన జర్మనీ అదే స్థానంలో స్థిరంగా ఉంటుందని నమ్మకం లేదు.ఎందుకంటే జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా నేలచూపులు చూస్తోంది.జర్మనీలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుని క్రమంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

దీంతో ఆర్థిక వృద్ధి రోజురోజుకీ క్షీణీస్తోంది.అటు సహజ వనరులు తగ్గడంతో పాటు యువశక్తి తగ్గిపోయింది.ఈ రెండు దేశాలు కార్ల ఎగుమతిలో ఇప్పటికే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.IMF డేటా ప్రకారం, భారతదేశం 2026లో జపాన్‌ను, 2027లో జర్మనీని అధిగమించగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.కానీ జపాన్,జర్మనీల్లో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే భారతదేశం ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది.

కాంగ్రెస్ పాలనలో భారత్ రక్షణ వ్యవస్థలో కేవలం 514 కోట్ల ఎగుమతుల వ్యాపారం జరిగింది.బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో రక్షణ వ్యవస్థ నుంచి 25 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి.అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలకు భారత్ రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందంటే…మిగతా రంగాల్లో మోడీ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.ఖాతార్ లాంటి దేశాల మెడలను వంచి భారత్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు మోదీ. అనేక దేశాలు ఇప్పుడు భారత్ తో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి.

మనదేశంలోని ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2024 డిసెంబరు నాటికి ఒక ట్రిలియన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఇదివరకే చెప్పారు.ఆ దిశగా పరిపాలన సాగిస్తున్నారు.ఇతర NDA పక్ష రాష్ట్రాలు కూడా మెరుగైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి మోడీ ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నాయి.మిగతా రాష్ట్రాలు కూడా కేంద్రానికి అండగా నిలిచి సహకారం అందిస్తే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయమేమీ కాదు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం చూస్తే అమెరికా ప్రస్తుతం 27.974 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.ఇక చైనా 18.566 ట్రిల్లియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలుస్తోంది.జర్మనీ 4.730 ట్రిల్లియన్ డాలర్లతో మూడో స్థానంలో, 4.291 ట్రిల్లియన్ డాలర్లతో జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.భారతదేశం 4.112 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. అన్నీ అక్రమంగా జరిగి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలని ఆశిద్దాం….

Read more RELATED
Recommended to you

Exit mobile version