అంబానీకి షాక్.. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అదానీ

-

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటి ఆయన మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం ఆస్తుల విలువ 111 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ముకేశ్ అంబానీ ఆస్తుల మొత్తం విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది.

గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్‌వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ ప్రపంచం సంపన్నుల బాబితాలో 11వ స్థానానికి చేరారు. 111 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీని వెనుక్కు నెట్టారు. $109 బిలియన్లతో అంబానీ అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు.

2023 జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం ఏకంగా 34 శాతం సంపద కోల్పోయిన అదానీ కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోడవంతో భారత్ తో పాటు ఆసియా, ప్రపంచ సంపన్నుల జాబితాలో చాలా స్థానాలు కోల్పోయారు. కానీ ఏడాది తిరగకుండానే మళ్లీ కోలుకుని తన స్థానాన్ని తిరిగిపొందడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version