బిహార్ సీఎం నితీశ్‌పై ఓ యువ‌కుడు దాడికి య‌త్నం.. అరెస్ట్

-

బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ పై ఓ యువ‌కుడు దాడికి ప్ర‌య‌త్నించాడు. అయితే సీఎం వ్య‌క్తిగ‌త సిబ్బంది వెంట‌నే తేరుకుని.. ఆ దాడిని అడ్డుకున్నారు. అలాగే ఆ యువ‌కుడి అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న ఈ రోజు సాయంత్రం చోటు చేసుకుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సొంత గ్రామం అయిన బ‌క్తియార్ పుర్ లో ఉండ‌గా.. ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ యువ‌కుడి పూర్తి వివ‌రాలు ఇంక తెలియాల్సి ఉంది.

కాగ యువ‌కుడు.. ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ పై దాడి చేస్తుండ‌గా… సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బిహార్ ముఖ్య మంత్రి నేడు త‌న సొంత గ్రామం అయిన బ‌క్తియార్ పుర్ కు షిల్ భ‌ద్ర యాజీ అనే స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌ర‌ణ చేయ‌డానికి వ‌చ్చారు.

విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి.. పూల మాల వేసి నివాళ్లు అర్పిస్తున్న స‌మ‌యంలో ఆ యువ‌కుడు స్టేజీ పైకి వ‌చ్చి సీఎం నితీశ్ ను వీపు పై కొట్టాడు. వెంట‌నే అప్ర‌మత్తం అయిన భ‌ద్ర‌తా సిబ్బంది ఆ యువ‌కున్ని అడ్డుకున్నారు. అలాగే అదుపులోకి తీసుకున్నారు. కాగ ఆ యువ‌కుడి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉందని బిహార్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version