World Cup 2023 : టీమిండియా ఘోర ఓటమికి ప్రధాన కారణాలు ఇవే !

-

 

World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ 2023లోను టీమిండియాకు నిరాశే ఎదురయింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా…. కీలక మ్యాచ్లో తేలిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సమిష్టిగా విఫలమైన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని నాలుగు తప్పిదాలు శాసించాయి.

Australia won by 6 wkts

టాస్ ఓడిపోవడం నుంచి ట్రావిస్ హెడ్ అసాధారణ ప్రదర్శన వరకు టీమిండియాకు అన్ని ప్రతికూలంగానే మారాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ మందకోడిగా ఉన్న పిచ్ పై చెలరేగింది. ఈ ప్రపంచకప్ లో సత్తా చాటిన టీమిండియా టాపర్డర్…. ఈ మ్యాచ్ లో తేలిపోయింది. ముఖ్యంగా ఓపెనర్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని శాసించింది. 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకున్న కోహ్లీ, రాహుల్ చివరి వరకు ఆడకపోవడం కూడా కొంపముంచింది. అటు సరైన సమయంలో హెడ్‌ వికెట్‌ తీయలేకపోయింది టీమిండియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version