World Cup 2023 : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..స్టార్ ఆల్ రౌండర్ దూరం

-

World Cup 2023 : వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో దుమ్ములేపుతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ దూరం అయ్యాడు. వన్డే ప్రపంచకప్ సెమీస్ రేస్ లో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ ముందు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మార్ష్ ఆసీస్ కు బయలుదేరాడు.

Australia’s Mitchell Marsh out of WC indefinitely

అయితే అతను ఎప్పుడు మళ్ళీ జట్టులో కలుస్తాడనేది మాత్రం వెల్లడించలేదు. ‘వ్యక్తిగత కారణాలవల్ల మార్ష్ స్వదేశానికి బయలుదేరాడు. అతడు మళ్ళీ జట్టుతో ఎప్పుడు కలుస్తాడు అనేదానిపై ఇప్పుడేం చెప్పలేం’ అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కంగారు జట్టు నవంబర్ 4న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో తలపడనుంది. కాగా లీగ్‌ దశలో మొదటి మ్యాచ్ ఇండియా వర్సెస్‌ ఆసీస్‌ జట్ల మధ్య జరిగింది. ఇందులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version