రాహుల్‌కు బీసీలంటే ఎందుకు చిన్నచూపు? : ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు బీజేపీ ముఖ్యమంత్రి సీటు ప్రతిపాదించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ.. బీసీ అభ్యర్థిని సీఎం ఎలా చేస్తుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు మోదీ వైపు చూస్తున్నారని.. రాహుల్‌కు బీసీలంటే ఎందుకు చిన్నచూపు? అని ప్రశ్నించారు. బీసీలకు మాట ఇచ్చి తప్పిన వ్యక్తి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీల వ్యతిరేక పార్టీలు అని విమర్శించారు. రెండో జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తామని వెల్లడించారు. బీజేపీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరడంపై స్పందిస్తూ.. కొంత మంది పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని.. తమ పార్టీలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి కీలక నేతలు చేరుతున్నారని లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version