అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణాన్ని మే నెలలో ప్రారంభిస్తామని ఇండో – ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు హజీ అర్ఫత్ షేక్ వెల్లడించారు. 3-4 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, మసీదుకు ‘మహమ్మద్ బిన్ అబ్దుల్లా’ పేరును పెడతామని తెలిపారు.
మసీదు నిర్మాణానికి అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న దన్నీపూర్ లో సుప్రీంకోర్టు 5 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు రకాల కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రామ్ లల్లాకు కానుకలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
బాల రాముడికి దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు అందజేస్తున్నారు. రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖి, ఆయన కుటుంబం ముందంజలో ఉంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు సమాచారం.